New Airports: ప్రతీ 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభం.. మంత్రి వెల్లడి..
- తెలంగాణలో త్వరలో కొత్త ఎయిర్ పోర్టులు ప్రారంభం..
- ప్రతీ 45 రోజులకు అందుబాటులోకి కొత్త ఎయిర్ పోర్ట్..
- మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన , వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశీయ విమానయాన రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. ముఖ్యంగా సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read:VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
గడిచిన కొన్నేళ్లలో విమానాశ్రయాల సంఖ్య అసాధారణంగా పెరిగింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తక్కువగా ఉన్న విమానాశ్రయాల సంఖ్య.. ప్రస్తుతం 167కు చేరుకోవడం విశేషం. ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా టైర్-2, టైర్-3 నగరాలకు కూడా విమాన సర్వీసులు విస్తరించాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం లభిస్తోంది.
భారత్‌లోనే విమానాల తయారీ జరిగితే డొమెస్టిక్ సర్వీసుల ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. దీనివల్ల విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి, దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విమాన ప్రయాణం విలాసం కాదు, అది ఒక అవసరమని భావిస్తూ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది విశాఖపట్నంపై ఒత్తిడిని తగ్గించి, అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచుతుంది. నెల్లూరు జిల్లా దగదర్తితో పాటు, కుప్పంలో కూడా కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి మరిన్ని నగరాలకు సర్వీసులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో వరంగల్ (మామునూరు), నిజామాబాద్ (జక్రాన్‌పల్లి), ఆదిలాబాద్‌లలో పాత విమానశ్రయాలను పునరుద్ధరించి, పౌర విమానయానానికి సిద్ధం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!