NTV Telugu Site icon

Rahul Gandhi: రాయ్‌బరేలీలో పోటీ చేయడంపై వయనాడ్‌ ప్రజలు ఏమంటున్నారంటే..!

Wayanda

Wayanda

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ శుక్రవారం రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. తన తల్లి సోనియాగాంధీ విడిచిపెట్టిన స్థానం నుంచి రాహుల్ బరిలోకి దిగారు. అయితే ఇప్పటికే ఆయన కేరళలోని వయనాడ్‌లో నామినేషన్ వేయడం.. ఏప్రిల్ 26న పోలింగ్ కూడా జరిగిపోవడం జరిగింది. తాజాగా ఆయన రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయడంపై వయనాడ్ ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది సమర్థిస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికే అధికార బీజేపీ విమర్శల దాడి చేస్తోంది. తాజాగా వయనాడ్ ప్రజల స్పందన భిన్నంగా కనిపించింది.

ఇది కూడా చదవండి: AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

రాయ్‌బరేలీలో కూడా పోటీ చేయడంలో తప్పేమీ లేదని కొందరు అంటుండగా.. ఇది కరెక్ట్ కాదని.. ఆయన తప్పు చేశారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో భాగంగా ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయడం వల్ల ఇబ్బంది లేదని పలువురు చెప్పుకొచ్చారు. ఒకవేళ రెండు స్థానాల నుంచి గెలిస్తే మాత్రం.. వయనాడ్‌ను వదులుకోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇదేమీ పద్ధతి కాదని.. ఏం జరుగుతుందో వేచి చూద్దామని ఇంకొందరు వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయాలన్న రాహుల్ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సీనియర్ నేత పీకే కున్హాలికుట్టి అభిప్రాయపడ్డారు. గతంలో ప్రధాని మోడీ కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారని కున్హాలికుట్టి గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Ariyana Glory: అమ్మ బాబోయ్ అరియనా అరాచకం.. మరీ ఇలా అయితే కష్టమే..

గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వయనాడ్‌లో గెలిచి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో కూడా వయనాడ్ పోటీ చేశారు. ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. ఈసారి వాయనాడ్‌లో సీపీఐ నేత అన్నీ రాజా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌తో పోటీ పడ్డారు. తాజాగా రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తన తల్లి సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. రాహుల్ పోటీ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి ఆమె వెనక్కి తగ్గడంతో రాహులే పోటీలోకి దిగాల్సి వచ్చింది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13. 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: US: ఉధృతం అవుతున్న పాలస్తీనా అనుకూల ఉద్యమం.. నిరాహార దీక్షకు పిలుపు