PM Modi: పాట్నా గురుద్వారాలో సిక్కు వేషధారణతో సేవ చేసిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పాట్నాలో పర్యటిస్తున్నారు. ఆదివారం బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహించారు. సోమవారం పాట్నా గురుద్వారాలో తలపాగా ధరించి ప్రధాని లంగర్ సేవ చేశారు. పాట్నా సాహిబ్ గురుద్వారా.. సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జన్మస్థలంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని నిర్మాణం 18వ శతాబ్దంలో గురుగోవింద్ సింగ్ జన్మస్థలానికి గుర్తుగా మహారాజా రంజిత్ సింగ్చే నిర్మించబడింది.
ఇది కూడా చదవండి: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్ ఇచ్చిన మాధవి లత
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
బీహార్ రాజధాని పాట్నాలోని సాహిబ్ గురుద్వారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తలపాగా ధరించి, ఖీర్ కుండ పట్టుకుని భక్తులకు లంగర్, సామూహిక భోజనం వడ్డించారు. ఆహారం వండడానికి గురుద్వారా నిర్వహణకు కూడా ప్రధాని మోడీ సహాయం చేశారు. స్వయంగా చపాతీలు తయారు చేయడం, భక్తులకు దగ్గరుండి వండించారు.
ఇది కూడా చదవండి: Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం రాత్రి పాట్నాలో రోడ్‌షో నిర్వహించారు. పూలు, బీజేపీ చిహ్నాలతో అలంకరించిన వాహనంపై ప్రధాని మోడీ దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవిశంకర్ ప్రసాద్‌లతో పాటు వీధుల్లోకి వచ్చిన జనసమూహానికి ప్రధాని మోడీ అభివాదం చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ కీలకమైన రాష్ట్రం. ఒక్కడ 40 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రం.. లోక్‌సభ స్థానాలకు అతి పెద్దదిగా ఉంది. ఇక్కడ బీజేపీ, జేడీయూ ఉమ్మడిగా బరిలోకి దిగాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరుగుతోంది. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..

తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?