Pune Car Crash: బాధిత కుటుంబాలు దు:ఖంలో.. నిందితుడికేమో రాచమర్యాదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రంలోని పూణెలో అత్యంత వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి అమ్మాయి, అబ్బాయి మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తుంటే.. ఇక పోలీస్ స్టేషన్‌లో అతగాడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!

ఓ వైపు బిడ్డల్ని కోల్పోయి కుటుంబ సభ్యులు దు:ఖంలో ఉంటే.. తాజాగా పోలీస్ స్టేషన్‌లో మైనర్ నిందితుడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే బాధిత కుటుంబాలకు కడుపు మండిపోతుంది. పైగా 15 గంటల్లోనే నిందితుడికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం.. ప్రమాదంపై ఒక వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం మరింత మతిపోతుంది. కోర్టు తీర్పుపై న్యాయ కోవిదులు, ప్రజలు విస్తుపోతున్నారు. ఇక ప్రమాదంలో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే కోర్టు తీర్పుపై కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నిందితుడు స్థానికంగా ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడంతో పోలీసులు అతడిని వీఐపీలా ట్రీట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
పుణెలో ఆదివారం తెల్లవారుజామున ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కారు డ్రైవ్ చేసిన నిందితుడు ఓ మైనర్ బాలుడు అని గుర్తించిన పోలీసులు అతడిని, అతడితో పాటు ఉన్న స్నేహితులను యార్వాడ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసుల అనుమతితో తల్లిదండ్రులు అతనికి పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ ఆర్డర్ చేసినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తూ పోలీసుస్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.
ఈ కేసులో నిందితుడికి 15 గంటల్లోనే బెయిల్ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడి బెయిల్‌ను రద్దు చేసి అరెస్టు చేయాలని మృతుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. బెయిల్ సమయంలో కోర్టు విధించిన షరతులు కూడా చర్చనీయాంశమయ్యాయి. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలంటూ న్యాయస్థానం చెప్పడం గమనార్హం.
మరోవైపు లైసెన్సు రాకుండానే బాలుడికి కారు ఇచ్చిన నిందితుడి తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఘటన సమయంలో బాలుడు మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి మద్యం విక్రయించిన రెండు బార్ల యజమానులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బారును అధికారులు తాజాగా సీజ్ చేశారు.
ఇక ఈ ఘటనపై పోలీస్ అధికారులతో డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ సమీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పును ఖండించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని.. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!