ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి బాగా తాగి ఉన్నట్లు మైనర్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా పోలీస్ వర్గాలు ఆదివారం తెలిపాయి. విచారణలో తనకు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా గుర్తుకు రాలేదని అధికారులకు తెలిపాడు.
మహారాష్ట్రలోని పూణెలో గత ఆదివారం ఓ బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి యువకుల ప్రాణాలు తీశాడు. అనంతరం నిందితుడికి వెంటనే బెయిల్ రావడం.. తర్వాత దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో అనంరతం బెయిల్ రద్దైంది.
పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోనూ బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది.
మహారాష్ట్రంలోని పూణెలో అత్యంత వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి అమ్మాయి, అబ్బాయి మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తుంటే.. ఇక పోలీస్ స్టేషన్‌లో అతగాడికి జరుగుతున్న రాచమర్యాదలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు.