Imran Khan: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం దాడిపై మౌనం వీడారు. దాడిలో నాలుగు బుల్లెట్లు తగిలాయని ఆయన వెల్లడించారు. జాతినుద్దేశించి చేసిన తన మొదటి ప్రసంగంలో తనపై గురువారం జరిగిన హత్యాయత్నం గురించి వివరించారు. ర్యాలీకి వెళ్లడానికి ఒకరోజు ముందు తనపై వజీరాబాద్ లేదా గుజరాత్‌లో హత్యకు ప్లాన్ చేస్తున్నారని తనకు తెలుసన్న ఆయన.. లాహోర్‌లోని ఆసుపత్రిలో టెలివిజన్ ప్రసంగంలో జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించాడు.
తలుపులు మూసి నన్ను చంపాలని నలుగురు వ్యక్తులు పథకం వేశారని.. తన దగ్గర వీడియో ఉందని, ఏదైనా జరిగితే, వీడియో విడుదల చేస్తానని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. గురువారం జరిగిన ఘటనలో తాను కంటైనర్‌లో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా తన కాళ్లకు బుల్లెట్లు తగిలి కిందపడ్డానని ఆయన తెలిపారు. తనపై దాడి చేసినవారు ఇద్దరు వ్యక్తులు అని ఆయన తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు పిస్టల్‌తో కాల్చిన ఒక వ్యక్తిని, మరో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు.70 ఏళ్ల క్రికెటర్-రాజకీయవేత్తగా మారిన ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో విశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుండి తొలగించబడ్డారు. తమను అధికారం నుంచి దించడానికి సంకీర్ణ నాయకులు డబ్బును ఉపయోగించారని ఆయన ఆరోపించారు.
China Rocket: పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు.. తప్పిన ప్రాణనష్టం
గురువారం పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో లాంగ్ మార్చ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డారు. ఇమ్రాన్ కాలికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పీటీఐ నేతలు తెలిపారు.ఈ కాల్పుల్లో ఏడుగురికి గాయాలు కాగా, ఒకరు మృతి చెందినట్లు గతంలో పోలీసులు తెలిపారు. ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిపిన అనుమానిత షూటర్ పోలీసులకు పట్టుబడ్డాడు, అక్కడ అతను ఇమ్రాన్ ఖాన్‌ను చంపాలనుకుంటున్నట్లు అంగీకరించాడు. అతను ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఒక్కడినే అని అబద్ధం చెప్పాడని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు.
#WATCH | Former Pakistan PM #ImranKhan says he was hit by four bullets, in his first address to the nation after the firing during his rally in Wazirabad, Pakistan yesterday.
(Video Source: Pakistan Tehreek-e-Insaf) pic.twitter.com/TWaa6ipLLy
— ANI (@ANI) November 4, 2022