Imran Khan: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం దాడిపై మౌనం వీడారు. దాడిలో నాలుగు బుల్లెట్లు తగిలాయని ఆయన వెల్లడించారు. జాతినుద్దేశించి చేసిన తన మొదటి ప్రసంగంలో తనపై గురువారం జరిగిన హత్యాయత్నం గురించి వివరించారు. ర్యాలీకి వెళ్లడానికి ఒకరోజు ముందు తనపై వజీరాబాద్ లేదా గుజరాత్‌లో హత్యకు ప్లాన్ చేస్తున్నారని తనకు తెలుసన్న ఆయన.. లాహోర్‌లోని ఆసుపత్రిలో టెలివిజన్ ప్రసంగంలో…
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల వజీరాబాద్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. ఇమ్రాన్‌కు ప్రాణహాని తప్పడంతో పీటీఐ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను ఇమ్రాన్ మాజీ భార్యలు ఖండించారు.