యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. గ్రీడ్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నిర్మించినది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో తెరిక్కేక్కిన ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా కావడంతో భారీ హిట్ కొడతాడని భావించారు. కానీ వారి నమ్మకాలను ఒమ్ము చేసాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఇద్దరు మాస్ హీరోలు కలిసి నటించిన సినిమాను పేలవమైన డైరెక్షన్ తో నిరుత్సహ పరిచాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2 యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇటు తెలుగులోను వార్ 2 ప్లాప్ గా మిగిలింది. ఫైనల్ రన్ లో రూ. 450 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ ఆవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ అక్టోబరు 9 నుండి స్ట్రీమింగ్ కు తీసుకువస్తోంది. థియేటర్ లో రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది వార్ 2. తెలుగు, తమిళ్, హిందీ బాషలలో స్ట్రీమింగ్ చేయనుంది. ఓటీటీ లో ఏ మేరకు రెస్పాన్స్ రాబడుతోందో.