యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీడ్ గాడ్ కాంబోలో వచ్చిన చిత్రం వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ వార్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య, వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చింది వార్. కానీ ఓవర్సీస్ ప్రీమియర్స్ తొలి ఆట నుండే మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది వార్ 2.
ఇద్దరు బడా స్టార్స్ ఉన్న కూడా కథ, కథనం అంతగా ద్రుష్టి పెట్టకుండా కేవలం యాక్షన్ పై మాత్రమే దర్శకుడు ఫోకస్ చేసాడని విమర్శలు వచ్చాయి. కానీ అవేమి వార్ 2 కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. వార్ 2 బాలీవుడ్ లో సూపర్బ్ స్టార్ట్ అందుకుంది. ఇండియా వైడ్ గా 15,583 షోస్ కు గాను రూ. 31.97Cr గ్రాస్ రాబట్టి 31.40% ఆక్యుపెన్సీ రాబెట్టింది. ముంబై లో రూ. 8.64కోట్లు ఢిల్లి రూ. 7.52 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా ఛావా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా వార్ 2 సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా వార్ 2 మొదటి రోజు రూ. 85 కోట్లకు పైగా వాసులు చేసిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. సౌత్ లో కూలీ తో భారీ పోటీలో రిలీజ్ అయినా కూడా వార్ 2 సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు కలెక్షన్స్ ఏ మేరకు రాబట్టిందో యూనిట్ వర్గాలు అధికారకంగా ప్రకటిస్తారేమో చూడాలి