Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పెరగాలంటే ఇలా చేయండి..
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవాలనుకుంటున్నారా
- ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయడం ముఖ్యం
- ఇన్ స్టాలో మంచి కంటెంట్‌ను అప్‌లోడ్ చేయాలి
- హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం మరిచిపోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో బిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. రోజూ కోట్ల మంది దీనిని వాడుతుంటారు. ఎన్నో ఫొటోలు, ఎన్నో వీడియోలు. సామాన్యుడిగా మొదలై ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో సెలెబ్రిటీలు అయినవారు ఉన్నారు. ఎప్పటికప్పుడు పోస్ట్లు పెడుతూ.. చురుకుగా ఉంటారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో సామాన్యులు, వ్యాపారవేత్తలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ లో వినియోగదారు తనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యను మరింత పెంచుకోవచ్చు. ఎక్కువ ఫాలోవర్లు ఉంటే.. ఆ వ్యక్తిపై మంచి అభిప్రాయాన్ని ఇస్తుంది.. నమ్మకాన్ని కూడా పెంచుతుంది. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ క్రియేట్ చేస్తే సరిపోదు. దానిలో అప్డేట్స్ ఉండాలి. అప్పుడే మీకు ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. ఫాలోవర్లను ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Damodara Raja Narasimha : ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయడం ముఖ్యం. అంతేకాకుండా.. కంటెంట్ చాలా ముఖ్యమైనది. మీరు ఇన్ స్టాలో మంచి కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తే ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి ఇన్‌స్టా రీల్స్. మీరు చేసే పనిని.. పొలం పనైనా, ఆఫీసు పనైనా అది రీల్స్ తీసినా వైరల్ అవుతూ ఉంటాయి. తక్కువ సమయంలో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చిన్న వీడియోలు చేయడం ద్వారా మీరు చాలా త్వరగా ఇతరుల దృష్టిని ఆకర్షించవచ్చు.
హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం మరిచిపోవద్దు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి అప్‌లోడ్ చేస్తున్న ఫోటోతో అనుబంధించబడిన హ్యాష్‌ట్యాగ్ (#)ని ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. దీని ద్వారా చాలా మంది మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోలను చూస్తారు. రీచ్ ఎక్కువగా ఉంటుంది. సరైన, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తే వేలలో మీకు లైక్స్ వస్తాయి దీంతో ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవాలనుకుంటే.. ముందుగా మీరు కంటెంట్‌కు అనుగుణంగా ఉండాలి. పోస్ట్‌లను క్రమం తప్పకుండా.. సరైన సమయంలో పోస్ట్ చేస్తే, ఇది ఫాలోవర్ల సంఖ్యను పెంచుతుంది.
Jharkhand: పాఠశాల ట్యాంక్ నీళ్లు తాగి 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి పెద్దగా చేయాల్సిన పనిలేదు. చాలా మంది వినియోగదారులు ఖాతాలో అప్‌లోడ్ చేసిన పోస్ట్‌లలో వారి వ్యాఖ్యలను వదిలివేస్తారు. ఆ క్రమంలో.. ఆ వ్యాఖ్యలకు సమాధానాలు లేదా క్రమం తప్పకుండా ప్రతిస్పందిస్తే ఫాలోవర్లు పెరుగుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన వారికి కింద కామెంట్స్ చేస్తూ ఉండండి. జనాదరణ పొందిన వ్యక్తుల పోస్ట్‌లను వ్యాఖ్యానిస్తే మీ కామెంట్స్ కి లైక్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్రొఫైల్ చూసేందుకు చాలా మంది వస్తారు. ఇది మీకు రెండు ప్రయోజనాలను ఇస్తుంది. మీరు మీ ఖాతాను దీని ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు. ఇతర జనాదరణ పొందిన వ్యక్తుల పోస్ట్‌లపై వ్యాఖ్యానించినప్పుడు, చాలా మంది వ్యక్తులు మీ కామెంట్స్ చూస్తారు. ట్రెండింగ్ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ట్రెండింగ్ అంశాలతో కొత్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ చాలా మంది ఫాలోవర్లను వేగంగా పొందుతారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..