Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య భర్త ఎందుకు? అని నాగమణి భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అక్టోబరు 28న ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేసింది. అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కారులో శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై వనపర్తి రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రంగంలోకి దిగిన పోలీసులు, నాగమణి, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణ హత్య కేసు వనపర్తిలో సంచలనం రేపింది. భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడే వర్చువల్ క్యూ బుకింగ్స్ ఓపెన్..
