New Delhi: ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని విద్యార్థులు ఎదురు చూస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో విద్యార్థి ఎన్నిలకు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో డే క్లాస్ విద్యార్థులకు ఉదయం 9 గంటలకి ఓటింగ్ ప్రారంభమైంది. కాగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డే క్లాస్ విద్యార్థులు వారికి నచ్చిన అభ్యర్ధికి ఓటు వేశారు. కాగా సాయంత్రం విద్యార్థులకు ఓటింగ్ 3 గంటల నుండి ప్రారంభమైంది. కాగా సాయంత్రం విద్యార్థులకు రాత్రి 7 గంటల 30 నిమిషాలవరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉదయం నుండి యూనివర్సిటీ బయట గస్తీ కాస్తున్నారు.
Read also:USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”
కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధికి మద్దతుగా నినాదాలు చెయ్యలేదని ఆ అవిద్యార్ధిపై అభ్యర్థి అనుచరులు దాడి చేసిన విషయం అందరికి సుపరిచితమే. అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.అయితే ఈ రోజు పోలీసులకి మోదీ తో విందు వుంది. G20 కార్యక్రమం విజయవంతం చేయడంలో పోలీసులు తమ వంతు కృషి చేశారని అభినందన విందు ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల్లో గస్తీ కాస్తూ కొందరు విందుకు హాజరు కాలేకపోయారని సాంఘీక మాధ్యమాల సమాచారం. కాగా ఈ ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. ఈ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చివరిసారిగా DUSU ఎన్నికలు 2019లో జరిగాయి. 2020 మరియు 2021లో COVID-19 కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. కాగా 2022 అకడమిక్ క్యాలెండర్ లో అంతరాయం కారణంగా ఎన్నికలు నిలిపివేశారు .