Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pydithalli Ammavari Jatara 2026: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ సిబ్బంది ప్రకటించారు. భక్తుల కోసం నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. జాతర మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1, గురువారం మండల దీక్ష ప్రారంభమవుతుంది. అనంతరం చదురు గుడి వద్ద, వనం గుడి వద్ద పందిరి రాట మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇక, అక్టోబర్ 22, గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం కానుంది. అనంతరం జాతరలో ప్రధాన ఘట్టమైన అక్టోబర్ 26, సోమవారం తొలేళ్ల మహోత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 27, మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించే సిరిమాను ఉత్సవం జరగనుంది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతరలో భాగంగా నవంబర్ 3, మంగళవారం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 7, శనివారం కలశ జ్యోతి ఊరేగింపు జరగనుంది. మహోత్సవాల చివరి దశలో నవంబర్ 10, మంగళవారం ఉయ్యాలకంబాల మహోత్సవం, నవంబర్ 11, బుధవారం చండీ హోమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలతో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు. జాతరలోని ప్రధాన ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు.
Also Read
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్‌ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- Deputy CM Pawan Kalyan: మోడీని మించిన నాయకుడు లేరు.. భోగాపురం సభలో పవన్ భావోద్వేగ ప్రసంగం
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!