Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?
- కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్
- 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 9300+ ప్రాసెసర్
- 50MP ప్రాథమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరాగా 32MP ఆటోఫోకస్ కెమెరా.
- 5500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
- 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999.
- HDFC, SBI, Axis కార్డులపై రూ. 3000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T4 Ultra: ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లను అందిస్తున్న వివో (vivo) తాజాగా తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పనితీరు, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించనుంది. మరి ఈ వివో ఫ్లాగ్షిప్ మొబైల్ వివో T4 అల్ట్రా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా..
అద్భుతమైన డిస్ప్లే:
vivo T4 Ultraలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, పీక్ బ్రైట్నెస్ 5500 నిట్స్ సామర్థ్యంతో వస్తోంది. స్క్రీన్కు SCHOTT Xensation α గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
Read Also: Nara Lokesh: పొదిలిలో వైసీపీ శ్రేణుల దాడి.. జగన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్

పవర్ఫుల్ కెమెరాలు:
మొబైల్ వెనుక భాగంలో 50MP సోనీ IMX921 ప్రాథమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీని ద్వారా 100x హైపర్ జూమ్, 10x టెలిఫోటో మాక్రో, Aura లైట్, 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాగా 32MP ఆటోఫోకస్ కెమెరా ఇచ్చారు.
శక్తివంతమైన ప్రాసెసర్:
ఈ ఫోన్‌కు MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌ను అందించారు. LPDDR5 RAM 8GB/12GB వరకు, UFS 3.1 స్టోరేజ్ 256GB/512GB వరకు లభిస్తుంది. శక్తివంతమైన VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15తో రన్ అవుతుంది. AI ఫీచర్లు గాను Circle to Search, Live Call Translation, Transcript Assist, Erase 2.0 వంటివి అందుబాటులో ఉన్నాయి.
Read Also: MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!

బ్యాటరీ:
ఈ మొబైల్ లో 5500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో, Wi-Fi 6, Bluetooth 5.4, NFC వంటి ఫీచర్లు అందించాయి.

ధరలు, వేరియంట్లు:
ఫీనిక్స్ గోల్డ్, మీటియోర్ గ్రే కలర్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ జూన్ 18వ తేదీ నుంచి వివో, ఫ్లిప్ కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా నిర్ణయించబడింది. అలాగే, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్ అయిన 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గా వివో నిర్ణయించింది.
లాంచ్ ఆఫర్లు:
HDFC, SBI, Axis కార్డులపై రూ. 3000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 5000 వరకు, అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ EMI అవకాశం కల్పించనున్నారు.
తాజావార్తలు
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
No Releases : ఈ సినిమాల విడుదలకు మోక్షం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!