Buy Redmi A2 Smartphone Just Rs 6499 in Amazon: మీ బడ్జెట్ తక్కువగా ఉందా?.. రూ. 10 వేలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ. 6499కే రెడ్‌మీ ఏ2ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇటీవలి రోజుల్లో వరుస ఆఫర్స్ ఉంటున్న విషయం తెలిసిందే.
రెడ్‌మీ ఏ2 ఫోన్ అసలు ధర రూ. 8999గా ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 28 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో మీరు రెడ్‌మీ ఏ2ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు రూ. 2,500 ఆదా చేసుకోవచ్చు. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా 5% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు మరి రూ. 10 వేలలోపు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇప్పుడే కొనేసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: Jacques Kallis: 48 ఏళ్ల వయసులో ఆ కొట్టుడేంది సామీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్ 6.52 ఇంచెస్ హెచ్‌డీ+ (1600 x 720 పిక్సెల్స్)ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz టచ్ శాంప్లింగ్ రేటు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్‌ను 7GB వరకు పెంచుకోవచ్చు. 64 GB వరకు స్టోరేజ్ ఉంది. మైక్రో SD ద్వారా 512 GB వరకు విస్తరించవచ్చు. రెడ్‌మీ ఏ2లో 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.