Viswa Hindu parishad: విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్. కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే GRP ( గవర్నమెంట్ రైల్వే పోలీసు ) మరియు రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైంది.
పలు రైళ్లు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన కారులను అక్కడి నుండి తరలించడంలో స్థానిక పోలీసు యంత్రాంగం ఇంకా ఎందుకు కాలయాపన చేస్తుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి ఈ శుక్రవారం కూడా కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులను ముందే హెచ్చరించినా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు.
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
దేశ భక్తితో భారత సైన్యంలో చేరాలనుకునే యువత రైళ్ళుకు నిప్పు పెట్టారంటే నమ్మలేం. నిరుద్యోగ యువతను ముందుపెట్టుకాని తెరవెనుక అసాంఘిక శక్తులు తమ విద్రోహ ఎజెండా అమలు చేస్తున్నాయని వీహెచ్ పీ ఆరోపించింది. ముఖాలకు గుడ్డలు కట్టుకొని పోలీసులపై రాళ్ళ వర్షం కురిపిస్తూ రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వీడియోలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా సంఘ విద్రోహకర శక్తుల పనే అనే విషయం తెలుస్తుంది.
జరిగిన విధ్వంసం వెనకాల రాజకీయ పార్టీల కుట్రలపై కూడా పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలి. అగ్నిపథ్ విషయంలో అవాస్తవాలు అపోహలు సృష్టిస్తున్న శక్తులపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ యువత అనవసర పుకార్లు నమ్మి దేశ వ్యతిరేఖ శక్తుల కుట్రలకు బలికావద్దని విశ్వహిందూ పరిషత్ కోరింది.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!