NTV Telugu Site icon

Vishwambhara : రికార్డుల దుమ్ముదులుపుతున్న విశ్వంభర టీజర్

New Project 2024 10 14t071607.601

New Project 2024 10 14t071607.601

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దసరా పండుగ సదర్భంగా విడుదలైన ఈ టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. టీజర్ ప్రారంభం నుండే అభిమానుల మనసును గెలుచుకుంది. “విశ్వం ఆధ్యాత్మిక రహస్యం” అనే పాయింట్ ద్వారా ఒక సరికొత్త కథాంశాన్ని తెరమీదకు తెచ్చాడు దర్శకుడు. టీజర్‌లోని భారీ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి.

Read Also:Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్‌ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ

టీజర్‌లో కనిపించిన డైనోసార్ లాంటి ప్రాణులు కూడా సినిమాకు కొత్తదనాన్ని చేకూర్చాయి. చెడు శక్తులు విజయం సాధించాలనుకుంటున్నా, వాటి ఆరాచకానికి మంగళం పాడే మహా యుద్ధం రాబోతోందన్న సంకేతాన్ని టీజర్ స్పష్టంగా ఇచ్చింది. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా కనిపిస్తోంది. టీజర్‌లో మెగాస్టార్ రెక్కల గుర్రంపై రావడం, చెడు శక్తులపై యుద్ధానికి సిద్ధమయ్యే విధానం ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆఖరి సన్నివేశంలో హనుమాన్ విగ్రహం ముందు మెగాస్టార్ చిరంజీవి తన గధతో కనిపించడం అభిమానులకు కనుల పండుగే. అంతేకాదు, టీజర్‌లో వినిపించిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. “చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని సృష్టిస్తుంది” అనే పాయింట్ సినిమా లోతును, కథలోని క్లైమాక్స్‌ను సూచిస్తోంది.

Read Also:YS Jagan: ఉచిత ఇసుక విధానంపై జగన్ సంచలన ట్వీట్

టీజర్ సక్సెస్ తో యూవీ క్రియేషన్స్ నుండి వచ్చే అప్‌డేట్ ల కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక సినిమాను మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అదే సమయానికి రావడం వలన క్లాష్ ఉండకూడదని వాయిదా వేశారు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తం మీద, విశ్వంభర టీజర్ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Show comments