Vishwambhara : రికార్డుల దుమ్ముదులుపుతున్న విశ్వంభర టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దసరా పండుగ సదర్భంగా విడుదలైన ఈ టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటికే 23 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. టీజర్ ప్రారంభం నుండే అభిమానుల మనసును గెలుచుకుంది. “విశ్వం ఆధ్యాత్మిక రహస్యం” అనే పాయింట్ ద్వారా ఒక సరికొత్త కథాంశాన్ని తెరమీదకు తెచ్చాడు దర్శకుడు. టీజర్‌లోని భారీ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి.
Read Also:Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
టీజర్‌లో కనిపించిన డైనోసార్ లాంటి ప్రాణులు కూడా సినిమాకు కొత్తదనాన్ని చేకూర్చాయి. చెడు శక్తులు విజయం సాధించాలనుకుంటున్నా, వాటి ఆరాచకానికి మంగళం పాడే మహా యుద్ధం రాబోతోందన్న సంకేతాన్ని టీజర్ స్పష్టంగా ఇచ్చింది. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా కనిపిస్తోంది. టీజర్‌లో మెగాస్టార్ రెక్కల గుర్రంపై రావడం, చెడు శక్తులపై యుద్ధానికి సిద్ధమయ్యే విధానం ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆఖరి సన్నివేశంలో హనుమాన్ విగ్రహం ముందు మెగాస్టార్ చిరంజీవి తన గధతో కనిపించడం అభిమానులకు కనుల పండుగే. అంతేకాదు, టీజర్‌లో వినిపించిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. “చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని సృష్టిస్తుంది” అనే పాయింట్ సినిమా లోతును, కథలోని క్లైమాక్స్‌ను సూచిస్తోంది.
Read Also:YS Jagan: ఉచిత ఇసుక విధానంపై జగన్ సంచలన ట్వీట్
టీజర్ సక్సెస్ తో యూవీ క్రియేషన్స్ నుండి వచ్చే అప్‌డేట్ ల కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక సినిమాను మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అదే సమయానికి రావడం వలన క్లాష్ ఉండకూడదని వాయిదా వేశారు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తం మీద, విశ్వంభర టీజర్ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!