తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే.. ఆయన సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం విశాల్ మాస్ సినిమాలతో సందడి చేస్తున్నాడు.. రీసెంట్ గా రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది..
ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోనూ రిలీజైనా.. ఇక్కడ మరీ దారుణమైన కలెక్షన్లు సాధించింది.. దాంతో నెలలోపే ఓటీటీలోకి రాబోతుంది.. మే 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే ఓటీటీ లోకి రాబోతుంది.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు..
ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియా భవానీ శంకర్ కూడా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైన్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. దాదాపుగా రూ.18 కోట్లు వరకు అందుకున్నట్లు తెలుస్తుంది..రత్నం మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని సమాచారం గతంలో వచ్చింది.. అక్కడ మెప్పించలేకపోయింది. మరి ఇక్కడ ఎలా మెప్పింస్తుందో చూడాలి..