Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: రోజురోజుకీ మోసాలు కూడా సరికొత్తవి వెలుగు చూస్తున్నాయి.. సైబర్ మోసాలు సతమతం చేస్తుంటో.. మరోవైపు సోషల్ మీడియా క్రైమ్ కూడా పెరిగిపోతుంది.. సోషల్ మీడియా పరిచయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి ఘరానా చోరీ వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్న ఓ మహిళ.. అనారోగ్యంతో ఉన్నానంటూ బాధితురాలి ఇంటికి వచ్చి రోజుల తరబడి అక్కడే ఉంటూ చివరకు బంగారు, వజ్రాల ఆభరణాలను చోరీ చేసిన ఘటన బయటకు వచ్చింది..
విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళ అనారోగ్యంతో ఉన్నానని చెప్పి ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉంటూ అందరితో కలిసిపోయింది. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా బీరువాలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను తీసుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
Also Read
- Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
- CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
- CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
ఇక, ఈ ఘటనపై బాధితురాలు మానేపల్లి నీరజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో భద్రపరిచిన 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర వజ్రాల ఆభరణాలు, బంగారు మెడల్ ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయంతో ఇంటికి వచ్చి నమ్మించి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని.. ఎలాంటి పరిచయాలు లేకుండా ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
-
Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్‌ను చూసి ఏడాది అయింది.. మరో అప్డేట్ అయినా ఇవ్వండి సార్..!
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
-
Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!