రూ.2 వేల నోట్ల మార్పిడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు విశాఖపట్నంలో కలకలం రేపాయి. తనిఖీల్లో భారీగా సొమ్మును గుర్తించిన పోలీసు అధికారిణి భారీ మొత్తంలో నగదు కాజేసినట్లు విశాఖ సీపీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే.. మహిళ సీఐ చేతివాటంలో విస్తురపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పరిధి కాకపోయిన అనధికార తనఖీలు చేపట్టడం.. కేసులు జైలు అంటు బెదిరింపులు…అందినకాడికి దోచుకోవడం ఈ మహిళా సీఐ స్టైల్. రిటైర్డ్ నేవల్ అధికారుల నుండి డబ్బు వసూళ్లు లో అదే పంథా కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఈ నెల నాల్గో తేదీన రియల్ ఎస్టెట్ ఏజెంట్ తో రూ 500 వందల నోట్లు 90 లక్షల ఇచ్చి కోటి రూ 2000 నోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు రిటైర్డ్ నేవీ అధికారులు. డబ్బుతో ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి వద్ద ఉన్న ఇద్దరి రిటైర్డ్ నేవిల్ ఉద్యోగులును బెదిరించి వారి వద్ద ఉన్న 90 లక్షలలో 15 లక్షలు నొక్కేసింది మహిళ సీఐ. ఈ వ్యవహరంపై సీపీకి నేరుగా ఫిర్యాదు చేశారు రిటైర్డ్ నేవీ ఉద్యోగులు. విచారణలో డబ్బులు తీసుకున్నట్టు నిర్థారణ కావడంతో.. మహిళా సీఐ స్వర్ణలత అరెస్టు కు రంగం సిద్దం చేశారు పోలీస్ కమిషనర్..
Also Read : Post Office: రూ.399 కే రూ.10 లక్షల బీమా.. తపాలా శాఖ వినూత్న పథకం
2000 రూపాయల దందా వ్యవహారంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలతపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ద్వారకా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 61/2023 నమోదు చేశారు. బాధితులను చంపేస్తామని బెదిరించి డబ్బు గుంజుకున్నట్టు ఎక్స్ టార్షన్ సెక్షన్ 386 ఐపిసి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమెతో పాటు పోలీసుల అదుపులోనే నలుగురు నిందితులు ఉన్నారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలతతో పాటు ఆమె డ్రైవర్ మెహర్ అలియాస్ హేమ సుందర్, మరొక హోంగార్డు శ్రీను, బ్రోకర్ సూర్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్వర్ణలతపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సివిల్ సెటిల్మెంట్ లకి యూనిఫాంలో వెళ్లి బెదిరించినట్లు ఆరోపణలు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ అయినా గతంలో నగరంలో పనిచేసిన పలువురు సీఐ లు పలు దందాలకు స్వర్ణ లత ను వినియోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అన్నింటి పై దృష్టి సారించారు విశాఖ పోలీసులు.