Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam-Araku Vistadome Train Journey: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అరుదైన జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలో విశాఖపట్నం-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ రైలు మార్గంగా ఎంపికైంది. “ఇండియన్ రూట్స్” ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో ఈ రూట్‌కు అగ్రస్థానం దక్కడం రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపును అందించేలా ఉంది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డులను జూన్ 15న గోవాలో నిర్వహించనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్-2026’ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అవార్డును స్వీకరించాల్సిందిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఇండియా టుడే సంస్థ అధికారిక ఆహ్వానం పంపింది. జాతీయ స్థాయి అవార్డు రావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. గోవా వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
తూర్పు కనుమల అద్భుత ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, గుహలు, పచ్చని లోయలు, జలపాతాల అందాల మధ్య సాగే విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేకతల కారణంగానే జాతీయ స్థాయిలో ఈ రూట్‌కు అత్యున్నత గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక శాఖ వెల్లడించింది. అలాగే గోవాలో జరిగే టూరిజం సమ్మిట్‌లో దేశంలోని పర్యాటక రంగ అభివృద్ధి, కొత్త అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై జరిగే కీలక చర్చల్లో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. ఈ అవార్డు ద్వారా రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి, పర్యాటక రంగాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..