Virender Sehwag: ఆర్యవీర్.. తృటిలో ఫెరీరా కారు మిస్ అయ్యావ్: సెహ్వాగ్
- ఆర్యవీర్ భారీ ఇన్నింగ్స్
- ట్రిపుల్ సెంచరీ ముంగిట తడబడ్డ ఆర్యవీర్
- ఆర్యవీర్‌పై ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ భారీ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ.. మేఘాలయాపై డబుల్ సెంచరీ చేశాడు. 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సులతో 297రన్స్ బాదాడు. మైదానం నలువైపులా మెరుపు షాట్లు ఆడిన ఓపెనర్ ఆర్యవీర్.. ట్రిపుల్ సెంచరీ ముంగిట తడబడ్డాడు. ట్రిపుల్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆర్యవీర్‌పై ప్రశంసల వర్షం కురిసింది.
తన కొడుకు ఆర్యవీర్ 23 పరుగుల తేడాతో ఫెరారీ కారు మిస్ అయ్యాడని వీరేంద్ర సెహ్వాగ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. టెస్టుల్లో వీరూ అత్యధిక స్కోరు 319 అన్న విషయం తెలిసిందే. ఆ స్కోరును దాటేందుకు జూనియర్ వీరూ 23 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తన అత్యధిక స్కోరు అధిగమిస్తే.. ఫెరారీ కారు కొనిస్తానని ఆర్యవీర్‌కు సెహ్వాగ్ మాట ఇచ్చాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. ‘ఆర్యవీర్ బాగా ఆడావ్. ఫెరీరా కారును 23 పరుగుల తేడాతో కోల్పోయావు. ఇదే పరుగుల దాహంను మున్ముందు కొనసాగించు. భారీ సెంచరీలు కొట్టాలి. ఫెరీరా కారును నా నుంచి నువ్ త్వరలోనే తీసుకుంటావ్ అనుకుంటున్నా’ అని వీరూ రాసుకొచ్చారు.
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
Also Read: Jasprit Bumrah: నా మొగుడు గొప్ప బౌలర్.. సంజనా ఫన్నీ కామెంట్! నవ్వుకోవాల్సిందే
గత అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీలో ఆర్యవీర్ అరంగ్రేటం చేశాడు. అండర్-19 వన్డే తొలి మ్యాచ్‌లో మణిపుర్‌పై 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరేంద్ర సెహ్వాగ్ మాదిరే ఆర్యవీర్ కూడా ఓపెనర్. తండ్రి బాటలోనే నడుస్తూ.. ఇన్నింగ్స్ ఆదినుంచే బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఆర్యవీర్ బ్యాటింగ్ చూస్తుంటే అంతర్జాతీయ క్రికెట్లోకి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్టులు, 251 టెస్టులు, 19 టీ20లు ఆడారు. మూడు ఫార్మాట్లలో కలిపి 38 సెంచరీలు బాదారు.
తాజావార్తలు
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!