టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ భారీ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ.. మేఘాలయాపై డబుల్ సెంచరీ చేశాడు. 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సులతో 297రన్స్ బాదాడు. మైదానం నలువైపులా మెరుపు షాట్లు ఆడిన ఓపెనర్ ఆర్యవీర్.. ట్రిపుల్ సెంచరీ ముంగిట తడబడ్డాడు. ట్రిపుల్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆర్యవీర్‌పై ప్రశంసల వర్షం…