Virender Sehwag Divorce: సతీమణి ఆర్తితో సెహ్వాగ్ విడాకులు.. ఇదిగో ప్రూఫ్!
- సతీమణి ఆర్తితో సెహ్వాగ్ విడాకులు
- దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ పోస్ట్
- సెహ్వాగ్, ఆర్తి సంసారంలోకి మరో వ్యక్తి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సతీమణి ఆర్తి అహ్లవత్‌కు విడాకులు ఇచ్చాడని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సెహ్వాగ్, ఆర్తిలు గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారని.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ఇద్దరూ ఇప్పటికే స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే 2025 దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన పోస్ట్.. ఆర్తితో విడాకులు నిజమే అని స్పష్టం చేస్తోంది.
దీపావళి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన ఎక్స్ ఖాతాలో ఫొటోస్ పోస్ట్ చేసి.. ఓ సంస్కృత శ్లోకాన్ని క్యాప్షన్‌గా పేర్కొన్నారు. ఒక ఫొటోలో సెహ్వాగ్ ఒక్కడే ఉండగా.. మరో ఫొటోలో వీరూ తల్లితో పాటు అతడి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ‘నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మెరుపును వదిలి వెళ్ళు. దీపావళి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ‘దీప్జ్యోతిః పరమం బ్రహ్మం దీప్జ్యోతిర్జనార్దన్ః । దీపో హర్తు మే పాం దీప్జ్యోతిర్నమోస్తుతే ॥’ అని సంస్కృత శ్లోకాన్ని కూడా పోస్ట్ చేశారు. వీరూ పోస్ట్ చేసిన ఫోటోలలో సతీమణి ఆర్తి అహ్లవత్ లేదు. దాంతో ‘విడాకులు నిజమే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
- Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో 'రామాయణం' ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్‌తో కట్టిపడేసిన మేకర్స్
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం...
Also Read: Palanadu News: చనిపోయి మూడు రోజులైనా.. తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయని కుమారులు!
2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌లు వివాహం చేసుకున్నారు. వీరికి కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరూ, ఆర్తిల వైవాహిక జీవితంలో 2-3 ఏళ్ల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. గతేడాది దీపావళి సందర్బంగా సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో విడాకుల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా మరోసారి రుజువైంది. విడాకులపై అటు సెహ్వాగ్, ఇటు ఆర్తి ఇప్పటివరకు స్పందించలేదు. బీసీసీఐలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసే ఆర్తిని వీరూ దూరం పెట్టాడట. ఇక భారత్ తరఫున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడారు.
తాజావార్తలు
-
SrinivasaMangapuram : ఘట్టమనేని ‘జై కృష్ణ’ శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ
-
Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
-
Honor X6e: హానర్ X6e రిలీజ్.. 7,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్
-
Atlee: బాలీవుడ్‌లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
-
Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!