టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అతనిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇక మైదానంలో ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో చెప్పనవసరం లేదు. ప్రత్యర్థులు అతన్ని కవ్వించారంటే.. వారికి మూడినట్లే. తనదైన స్టైల్‌లో వారికి ఇచ్చిపడేస్తాడు. ఇక.. బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా తన కుటుంబంతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే.. తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు.