ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆర్సిబి, కేకేఆర్ టీమ్స్ తలపడగా.. అందులో కేవలం ఒక్క పరుగుతో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఫన్నీ సన్నివేశం ఎదురైంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
Also Read: Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు..
కేకేఆర్ బ్యాట్స్మెన్ సునీల్ నరైన్ ఎప్పుడు చూసినా ఏదో ముఖాభావంగా, ఏదో కోల్పోయినవాడిలా ముఖం పెట్టుకొని ఉండడం చూస్తుంటాం. ఇప్పటివరకు అతను నవ్విన పాపాన ఒక ఫోటో కూడా చూసింది లేదు. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ చేసిన, సెంచరీ చేసిన లేక బౌలింగ్లో వికెట్లు తీసిన ఇతరుల మాదిరి అతడు తన సంతోషాన్ని బయటకి కనబడకుండా సెలబ్రేట్ చేసుకుంటాడు. అంత కూల్ అండ్ కామ్ గా తన పని తను చేసుకుంటూ.. రాముడు మంచి బాలుడు అనేలా ఉంటాడు.
Also Read: MaheshBabu SRH: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్.. వైరల్ పిక్..
అలాంటి వ్యక్తిని టీమిండియా సూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ నవ్వించాడు. అది కూడా సునీల్ నరైన్ ను పడి పడి నవ్వుకునేలా చేశాడు. మ్యాచ్ మొదలయ్యే సమయంలో కోహ్లీ చేసిన ప్రాంక్ కారణంతో సునీల్ తెగ నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాడు. సునీల్ నరైన్ దగ్గరికి కోహ్లీ వచ్చి చెప్పిన జోకుకు అతడు నవ్వకుండా ఉండలేకపోయాడు. అసలు నవ్వు ఆపుకోలేక గట్టిగా పగలబడి నవ్వి.. అలాగే క్రీజ్ లోకి చేరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో సునీల్ కాస్త విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులకే విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ మూమెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.