టీమిండియా క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలది ఓ చరిత్ర. వీరిద్దరూ ఒంటిచేత్తే జట్టుకు ఎన్నో విజయాల్ని అందించారు. తమ ఆటతీరుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు వీరు వయసురీత్యా కొన్ని ఫార్మాట్లలో ఆడకపోవచ్చని టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి టీ20 భవిష్యత్తుపై జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా వారిద్దరూ భారత జట్టుకు గొప్పగా సేవలందించారని.. అయితే వారి వయసు, ఫామ్‌ని బట్టి భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడతారా అనేది ప్రశ్నగా మారిందన్నాడు.
Also Read: ChatGPT: దూసుకెళ్తున్న చాట్‌జీపీటీ.. రెండు నెలల్లోనే రికార్డు యూజర్లు
“ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లోనే వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. ప్రపంచకప్ వరకు రోహిత్, విరాట్ ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు వారికి విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చు. అయితే భవిష్యత్తును ఒకసారి పరిశీలిస్తే మాత్రం టీ20ల్లో కేవలం యువకులే ఉంటారు. తర్వాతి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడతాడని నేను అనుకోవట్లేదు. విరాట్‌కు కూడా అవకాశాలు తక్కువే. కానీ రోహిత్ మాత్రం కచ్చితంగా ఆడడు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36. అందువల్ల వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఎంత ఫిట్‌గా ఉంటాడో ఎలాంటి ఫామ్‌ని కొనసాగిస్తాడో చూడాలి” అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 9న భారత్ – ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్, రోహిత్ ఈ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నారు.
Also Read: Shaheen Afridi: షాహిద్ అఫ్రిది కూతురితో షహీన్ పెళ్లి..ఫోటోలు వైరల్