చాట్‌జీపీటీ..ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు. ఈ టెక్నాలజీ యుగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఇది ఒక చాట్‌బోట్. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా రికార్డు సృష్టించింది. ఈ చాట్‌బోట్ కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. చాట్‌బోట్ ఒక్క జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ సహా ఇతర సోషల్‌మీడియా యాప్‌లను అధిగమించి తక్కువ సమయంలోనే 100 మిలియన్ యూజర్లను దక్కించుకున్న యాప్‌గా ఘనత సాధించింది. ఇతర యాప్‌లు ఈ మైలురాయిని చేరటానికి దాదాపుగా రెండున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Dulha Dulhan Course : పెళ్లి ప్రయత్నంలో ఉన్నారా.. తప్పకుండా ఈ కోర్స్ లో చేరండి
గతేడాది డిసెంబర్‌లోనే చాట్‌జీపీటీని తీసుకొచ్చారు. దీన్ని డెవలప్ చేసేందుకు ఎలాన్ మస్క్ కూడా పెట్టుబడులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో పనిచేసే ఈ చాట్‌బోట్ యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని కచ్చితత్వంతో చూపిస్తుంది. అందుకే అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. గత 20 ఏళ్లుగా ఇంత వేగంగా వినియోగదారులకు చేరువైన యాప్ లేదని యూబీఎస్ రీసెర్చ్ వెల్లడించింది. గత వారం రోజులుగా రోజుకు 25 మిలియన్ వీక్షకులు ఈ chat.openai.com వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. జనవరి 31న చాట్‌జీపీటీని రికార్డు స్థాయిలో వినియోగించారట. సాధారణ రోజుల్లో 15.7 మిలియన్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తే.. జనవరి 31న ఆ సంఖ్య 28 మిలియన్లుగా ఉందని సిమిలర్‌వెబ్ గణాంకాలు పేర్కొన్నాయి.
Also Read: Shaheen Afridi: షాహిద్ అఫ్రిది కూతురితో షహీన్ పెళ్లి..ఫోటోలు వైరల్
కాగా, చాట్‌జీపీటీ వాడకం మరింత పెరిగిపోతే గూగుల్‌తో పాటు ఇతర ఇంటర్నెట్ దిగ్గజాల గ్రోత్ రేట్ తగ్గిపోయే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో చాట్‌జీపీటీ తరహా సేవలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. చైనాకు చెందిన బైడూ కూడా సొంతంగా చాట్‌జీపీటీని డెవలప్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Also Read: Selfy Psychology: మీరు ఏ చేత్తో సెల్ఫీ తీసుకుంటారు