పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఓ ఇంటివాడయ్యాడు. ఆ దేశ మాజీ క్రికెటర్, తన బంధువు అయిన షాహిద్ అఫ్రిదీ కుమార్తెను షహీన్ వివాహం చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి షహీన్-అన్షాల నిఖా వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో షహీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్ కలందర్స్ జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతోపాటు ‘లాహోర్ కలందర్స్ నుంచి అంతులేని సంతోషం కలగాలని కోరుకుంటున్నాం’ అని పోస్టు పెట్టింది. పలువురు పాక్ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్ తదితరులు వచ్చి కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు.
"Qabool Hai, Qabool Hai"#NewBeginings #ShaheenShahAfridi pic.twitter.com/4kiswYI0iG
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
Lahore Qalandars wishes eternal bliss to ©️ @iShaheenAfridi pic.twitter.com/7hOXBLK401
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
షహీన్, అన్షా ఇద్దరికీ 2021లోనే నిశ్చితార్థం జరిగింది. వీళ్లిద్దరి వివాహం కోసం ఇరువైపు బంధువులు ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు శుక్రవారం నాడు రెండు కుటుంబాలు కలిసి వివాహం జరిపించారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియోను కూడా లాహోర్ కలందర్స్ నెట్టింట పంచుకుంది. కాగా, కొన్నిరోజుల క్రితం తన జీవితంలోని ఇబ్బందుల గురించి మాట్లాడిన షహీన్.. ఒకానొక సందర్భంలో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేయాలని అనుకున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా క్రికెట్‌కు షహీన్ దూరమయ్యాడు. గతేడాది ఆసియా కప్ సమయంలో మోకాలి గాయంతో ఆ టోర్నీలో ఆడలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ నాటికి అతను కోలుకున్నాడు. ఆ మెగా టోర్నీలో పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా కొంత రాణించాడు. కానీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు షహీన్. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండి కోలుకుంటున్న
The look sooo cute together
MashaAllah ❤️ #anshaafridi#ShaheenShahAfridi pic.twitter.com/To90e7ruHt— Dr. Maaham Khan (@LazyMeem) February 3, 2023