Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ తప్పుడు ప్రచారాలపై విరాట్ కోహ్లీ అధికారిక ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అబద్ధాలని స్పష్టం చేస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఫలాహారీ మహారాజ్ దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ఆధారాలు లేనివని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
విరాట్ కోహ్లీ దాదాపు 5 కోట్ల రూపాయలు తీసుకుని బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లారంటూ ఇటీవల కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఈ ప్రచారం కాస్త పెద్దది కావడంతో ఆశ్రమానికి చెందిన ఒక శిష్యుడు ఇప్పటికే స్పందించి ఇదంతా కట్టుకథ అని కొట్టిపారేశారు. తాజాగా కోహ్లీ టీమ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. దినేష్ శర్మ చేసిన ప్రతి ఆరోపణను విరాట్ ప్రతినిధి తేల్చిపారేశారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి గానీ, లేనిపోని అపోహలకు గానీ తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కోహ్లీ టీమ్ ఇంత త్వరగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. “విరాట్ కోహ్లీకి సంబంధించి ఫలాహారీ మహారాజ్ దినేష్ శర్మ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం, నిరాధారం. అందులో ఎలాంటి వాస్తవం లేదు” అని ప్రతినిధి ఖచ్చితమైన మాటల్లో స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తమ వైఖరి ఏంటో కోహ్లీ బృందం స్పష్టంగా వెల్లడించినట్లయింది. కాబట్టి ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని తేలిపోయింది.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ఇక, విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ పలుమార్లు ప్రేమానంద్ మహారాజ్‌ను కలవడానికి బృందావన్ వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే, వారు ఆశ్రమానికి ఎందుకు వెళ్తుంటారనే దానిపై కూడా ప్రతినిధి స్పష్టత ఇచ్చారు. విరాట్ కోహ్లీకి ప్రేమానంద్ మహారాజ్ అంటే ఎంతో భక్తి, అపారమైన నమ్మకం అని, కేవలం ఆ ఆధ్యాత్మిక భావనతోనే ఆయన అక్కడికి వెళ్తారని చెప్పారు. అంతేతప్ప దీని వెనుక ఎలాంటి ఇతర కారణాలు గానీ, ప్రచారంలో ఉన్న కథనాలు గానీ లేవని స్పష్టం చేశారు. కేవలం ఈ పుకార్లను ఖండించడమే కాకుండా, మీడియాకు కూడా కోహ్లీ ప్రతినిధి ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులకు సంబంధించిన వ్యక్తిగత లేదా సున్నితమైన విషయాలపై వార్తలు రాసేటప్పుడు, ఆ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలను ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!