Virat Kohli broke Virender Sehwag record of 8503 runs in Test cricket: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ను అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 24 పరుగుల వద్ద ఈ ఫీట్ అందుకున్నాడు. కింగ్ కోహ్లీ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో 8515 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ 109 టెస్టుల్లో 8515 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్. ఇక వీరేందర్ సెహ్వాగ్ టెస్టుల్లో 8503 రన్స్ చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున 200 టెస్టులు ఆడి 15921 పరుగులు చేశాడు. ది వాల్ రాహుల్ ద్రవిడ్ 166 టెస్టుల్లో 13288 పరుగులు నమోదు చేశాడు. ఈ జాబితాలో టెస్ట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 125 టెస్టుల్లో 10122 రన్స్ సాధించాడు. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ 134 టెస్టులలో 8781 పరుగులు చేశాడు. ఇప్పుడు టాప్ 5లోకి కోహ్లీ వచ్చాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. తొలి బౌండరీ బాదడానికి చాలా బంతులు తీసుకున్నాడు. కోహ్లీ తాను ఎదుర్కొన్న 80 బంతుల్లో కేవలం సింగిల్స్, డబుల్స్‌తోనే 29 పరుగులు చేశాడు. 81వ బంతికి కవర్ డ్రైవ్ ద్వారా బౌండరీల ఖాతా తెరిచాడు. తొలి బౌండరీ కొట్టానన్న సంతోషమో తెలియదు కానీ.. సెంచరీ సాధించినంత ఫీలింగ్‌తో అతడు సెలబ్రేషన్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది.
Also Read: Honda Dio 125 Price: స్మార్ట్‌కీతో హోండా డియో 125.. ధర ఎంతో తెలుసా?
Also Read: Tomatoes For Flight Bookings: ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!
Virat Kohli has surpassed Virender Sehwag to become India's 5th highest run scorer in Test cricket. pic.twitter.com/8ECkbusnBS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2023