Virat Kohli: లండన్‌లో ఆ ప్లేయర్‌తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఇంగ్లాండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ ద్వారా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, ఆ సీజన్లో 600కు పైగా పరుగులు సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. జూలై 14న బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.
ఈ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు, ఇంగ్లాండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. విరాట్ కోహ్లీతో లండన్‌లో జరిగిన తన భేటీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టులో కోహ్లీతో కలిసి ఆడిన కాక్స్.. గత నెల లండన్‌లో అతడిని కలిశాడు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఓ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ లండన్ మీటింగ్ గురించి కాక్స్ ఇటీవల మాట్లాడుతూ.. తామిద్దరం ఆ భేటీని ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్‌గా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ, ఎవరో దొంగచాటుగా ఫోటోలు తీసి వైరల్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నాడు. “విరాట్‌కి తెలియకుండానే కొందరు వ్యక్తులు అతడిని ఫాలో అవ్వడం నిజంగా బాధాకరం. మేము లండన్ వీధిలో కూర్చున్నప్పుడు వందలాది మంది మా పక్కనుంచే నడిచి వెళ్లారు, ఎవరూ ఆగలేదు, ఏమీ చేయలేదు. కానీ, ఆ తర్వాత రెండు గంటలకే కోహ్లీ నాకు మెసేజ్ చేస్తూ.. ‘ఈ ఫోటోలు చూశావా?’ అని అడిగాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. అసలు ఇదెలా సాధ్యమైంది అనుకున్నాను” అని కాక్స్ ‘ది గార్డియన్’ పత్రికతో పేర్కొన్నాడు. కోహ్లీపై అభిమానులకు ఉన్న క్రేజ్ గురించి చెబుతూ.. విరాట్ కోహ్లీ అందరిలాగే చాలా సాధారణ జీవితాన్ని గడపాలని, ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. కానీ, దురదృష్టవశాత్తూ అతనికి అది ఎప్పుడూ సాధ్యపడదన్నాడు.
Also Read
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!