ఆర్సీబీ ఆటగాళ్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వారికి ఇంకా పరిస్థితి తెలియకపోవచ్చు. అయితే.. సంఘటనలు జరిగినప్పటికీ వేడుకలు ప్రణాళిక ప్రకారం కొనసాగడం ఆందోళనకరంగా భావిస్తున్నారు. ఈ వేడుకలను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. కానీ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. నినాదాలను ఆపివేయమని కోరాడు.
READ MORE: YS Jagan: ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. ‘వెన్నుపోటు దినం’పై జగన్ ఆసక్తికర పోస్ట్..
“నా దగ్గర ఎక్కువ సమయం లేదు. ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలి. మీకు ట్రోఫీని చూపించాలి. కాబట్టి దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. మేము ట్రోఫీని గెలిచిన తర్వాత మా కెప్టెన్ చెప్పిన మాటలను పునరావృతం చేస్తూ నేను ప్రారంభిస్తాను. ఇకపై ‘ఈ సాలా కప్ నమ్దే’ కాదు.. ‘ఈ సాలా కప్ నమ్దు’. మేము సాధించాం. ఇది 18 సంవత్సరాలుగా ఇక్కడ ఆడుతున్న ఆటగాళ్లకే సొంతం కాదు.. ఈ విజయం ఎంతో మంది అభిమానులది. ఈ విజయాన్ని 18 సంవత్సరాలుగా ఆర్సీబీకి మద్దతు ఇచ్చిన ప్రజలకి అంకితం చేస్తున్నాం. ప్రపంచంలోని ఏ జట్టు్ఏకూ ఇంత పెద్ద ఎత్తున అభిమానులను నేను ఎప్పుడూ చూడలేదు. మీ అందరికీ అభినందనలు.” అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అనంతరం కెప్టెన్ రజత్ పాటిదార్ ను కొనియాడుతూ వేదికపైకి స్వాగతం పకికాడు.
READ MORE: RCB Victory Parade Stampede: ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇదే..