NTV Telugu Site icon

Virat Kohli: మరో ఘనత.. టెస్టుల్లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరిన ‘కింగ్’..

Virat Kohli Bcci

Virat Kohli Bcci

టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరుఫున 9 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టెస్ట్‌ల్లో 18 వ క్రికెటర్‌గా ఉన్నాడు.

Read Also: Telangana: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ.100కోట్ల విరాళం

విరాట్ కోహ్లీ 9 వేల క్లబ్ లోకి చేరుకోవడానికి ముందు.. అతనికి 53 పరుగులు అవసరం. అయితే.. మొదటి ఇన్నింగ్స్‌లో అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడి 15వ బంతికి తొలి పరుగు తీశాడు. ఆ తర్వాత.. 70 బంతుల్లో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు.. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) ఈ ఘనత సాధించారు. కోహ్లీ 197వ ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఇన్నింగ్స్ పరంగా భారత ఆటగాళ్లలో ఇదే అత్యంత స్లోయస్ట్.

Read Also: Pro Kabaddi League Season 11: కాసేపట్లో ప్రో కబడ్డీ లీగ్.. ఫుల్ షెడ్యూల్ ఇదే

విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 116 మ్యాచ్‌లు ఆడాడు. అందులో.. 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలతో సహా 9000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 31 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 254 పరుగులు.

Show comments