NTV Telugu Site icon

Virat Kohli Catch: ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ పట్టిన విరాట్ కోహ్లీ.. సంభ్రమాశ్చర్యాలకు గురైన భారత ప్లేయర్స్!

Virat Kohli Catch

Virat Kohli Catch

Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొలి మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేసిన 18వ ఓవర్లోని నాలుగో బంతికి విండీస్ ప్లేయర్ రొమారియో షెపర్డ్‌ షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌కు తగిలి.. సెకండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు వెళ్లింది. బంతి కొద్ది ఎత్తులో.. అదీనూ కోహ్లీకి కాస్త దూరంగా వెళుతుండడంతో క్యాచ్ అసాధ్యం అనుకున్నారు అందరూ. అయితే విరాట్‌ డైవ్ చేసి మరీ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టేశాడు. దాంతో 2 బంతులు ఆడిన షెపర్డ్‌ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ పట్టిన విరాట్ కోహ్లీని చూసి భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు. శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్, రోహిత్ శర్మలు నవ్వుకుంటూ కోహ్లీని అభినందించారు. ఈ వీడియో చూసి ఫాన్స్.. ‘అదిరే క్యాచ్‌’, ‘బెస్ట్ క్యాచ్’, ‘స్టన్నింగ్ క్యాచ్‌’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగలేదు. లక్ష్యం చిన్నదిగా ఉండడంతో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు విరాట్ బ్యాట్ పట్టలేదు. మరోవైపు ఆర్ జడేజా (3/37) మూడు వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Gold Today Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Manipur Viral Video: మణిపూర్‌ మహిళల కేసును నేడు విచారించనున్న సుప్రీంకోర్టు

 

Show comments