Virat Kohli Catch: ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. సంభ్రమాశ్చర్యాలకు గురైన భారత ప్లేయర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొలి మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేసిన 18వ ఓవర్లోని నాలుగో బంతికి విండీస్ ప్లేయర్ రొమారియో షెపర్డ్ షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌కు తగిలి.. సెకండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు వెళ్లింది. బంతి కొద్ది ఎత్తులో.. అదీనూ కోహ్లీకి కాస్త దూరంగా వెళుతుండడంతో క్యాచ్ అసాధ్యం అనుకున్నారు అందరూ. అయితే విరాట్ డైవ్ చేసి మరీ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేశాడు. దాంతో 2 బంతులు ఆడిన షెపర్డ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
Also Read
ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీని చూసి భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు. శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్, రోహిత్ శర్మలు నవ్వుకుంటూ కోహ్లీని అభినందించారు. ఈ వీడియో చూసి ఫాన్స్.. ‘అదిరే క్యాచ్’, ‘బెస్ట్ క్యాచ్’, ‘స్టన్నింగ్ క్యాచ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగలేదు. లక్ష్యం చిన్నదిగా ఉండడంతో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు విరాట్ బ్యాట్ పట్టలేదు. మరోవైపు ఆర్ జడేజా (3/37) మూడు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Gold Today Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Manipur Viral Video: మణిపూర్ మహిళల కేసును నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
What a catch by Virat Kohli.
– The GOAT in ODI.pic.twitter.com/ckq8PIpflS
— Johns. (@CricCrazyJohns) July 27, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!