NTV Telugu Site icon

Virat Kohli: భార్యతో కలిసి భజన చేస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్

Virat Kohli

Virat Kohli

Virat Kohli and Anushka Sharma at Krishna Das Kirtan in Mumbai: ఆదివారం బెంగళూరు టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. విరాట్ ఇక్కడకు చేరుకున్న వెంటనే.. అతను తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ‘కర్వా చౌత్‌’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జంట కీర్తన కార్యక్రమానికి హాజరై భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. కృష్ణదాస్ కీర్తన కార్యక్రమం జరుగుతున్న సమయంలో వారిద్దరూ హాజరయ్యారు. ఈ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు కూడా విరాట్, అనుష్క లు లండన్‌లో జరిగిన ఒక సందర్భంలో ఈ కీర్తనలో కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా వీరిద్దరి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.

Also Read: Farooq Abdullah: కాశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదు.. మీకు స్నేహం కావాలంటే

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్, రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక బెంగళూరులో మ్యాచ్ ముగిసిన వెంటనే ముంబైలోని తన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు కోహ్లీ. దీనికి ముందు కొంతకాలంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం అతను లండన్ నుండి ఇక్కడకు కూడా చేరుకున్నాడు.

Also Read: Charles III: బ్రిటన్‌ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..

Show comments