ప్రీ-వెడ్డింగ్ షూట్స్ పేరుతో ఈ మధ్య లైట్స్.. కెమెరా.. ఓవరాక్షన్ చేయడమే పనయింది కొంతమందికి. తాజాగా ప్రాణం మీదకు తెచ్చింది ప్రీ-వెడ్డింగ్ షూట్. ఇందుకు సంబంధించి వీడియో, స్టోరీ ఏంటో ఓ సారి చూద్దాం.. ట్రావెలింగ్ వీడియోస్ తో సోషల్ మీడియాలో బాగా పాపులరైన ఆర్యా వోరా ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఉన్న ఆమెను కొందరు ఎలివేషన్లొచ్చి బుల్లితెర సూపర్ స్టార్ గా మార్చేశాయి. దేవో కి దేవ్ మహదేవ్ అనే సీరియల్ లో నటించి మరింత పాపులర్ అయ్యింది ఆమె. కాకపోతే ఆర్యాఓరా అనుకోకుండా ప్రాణాలమీదకొచ్చింది. ఈ విషయాన్ని తానే సోషల్ మీడియా వేదికగా గొల్లుమంది.
Also Read: Palla Rajeshwar Reddy: పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తాం..
హిమాచల్ ప్రదేశ్‌రాష్ట్రంలో ఉన్న స్పితి వ్యాలీ ఎవరైనా వెళ్లారా..? అంటూ.. నేను వెళ్లా.. ప్రీ-వెడ్ షూట్ చేశా.. అంటూ గర్వపడుతూనే ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ సుందరి. కాకపోతే అక్కడ విపరీతమైన చలితో స్పృహ తప్పి పడిపోయా.. తనకి పక్కనున్నవాళ్లు ఫస్ట్ ఎయిడ్ చేసారని., ఒక్కసారిగా తన శరీరంలోని ఉష్ణోగ్రత పడిపోయి హైపోథెర్మియాకు గురయ్య అంటూ తన అభిమానులతో అనుభవాన్ని పంచుకుంది. అయితే కాస్త ఇప్పుడు పరిస్థితి కాస్త మృత్యువుతో పోరాడే వరకు వెళ్ళిందంట.
Also Read: HIV: ఎయిడ్స్ నివారణకు చికిత్స..
ఇలా ప్రీ-వెడ్ షూట్ అనే పిచ్చికి పోయి బలైన జీవితాలు ఇంకా ఎన్నో. జీవితం లో ఒక్కసారి చేసుకునేందుకు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ అనేక అనర్థాల్ని కొనితెచ్చుకున్నవాళ్లు కూడా ఎందరో. ప్రస్తుతం ఇలా డిఫరెంట్ స్టైల్ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో కొనసాగుతున్న పైత్యానికి ఈ ఉదంతాన్ని పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కాబట్టి.. పెళ్లికి ముందు జరిగే వైపరీత్యాలకు మరి ఎండ్ కార్డ్ పడేదెప్పుడో చూడాలి మరి.