Chilling In Rain: మనలో చాలామంది వర్షంలో తడవడం, అలాగే ఆనందంగా గడపడం లాంటి పనులు ఎన్నో చేసి ఉంటాము. చిన్న వయసులో ఏది ఒప్పో.. ఏది తప్పో తెలియని వయసులో వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేసే ఉంటాము. అదే ఎంజాయ్ వయసు పెరుగుతున్న కొద్ది భారీగా వర్షం పడుతున్న.. పూర్తి స్వేచ్ఛ ఉన్న కానీ చుట్టూ ఉన్న నలుగురు ఏమనుకుంటారో అని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అయితే తాజాగా సోషల్ మెడిలో ఓ వ్యక్తి వీడియో తెగ వైరల్ గా మారింది. వర్షం నీటిలో తన పక్కన ఏం జరుగుతుందని ఆలోచన లేకుండా ఎంజాయ్ చేయడం అందులో గమనించవచ్చు.
Viral Video: మీ పిల్లలు మొబైల్స్ కు బానిసలయ్యారా..? ఒక్కసారి ఈ వీడియో చూపించండి!
గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక నగరాలను వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. అయితే ఈ వానల మంది అనేకమంది ఇబ్బందులు పడుతుంటే, మరికొందరేమో వర్షాలతో ఎంజాయ్ చేస్తున్నారు. నగర వీధులు ముంపులో ఉన్నా కూడా వినోదం ఆగడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈ విషయాన్ని మరొక్కసారి రుజువు చేసింది. వైరల్ అవుతున్న వీడియో ముంబై లోని ముంబ్రా ప్రాంతానికి చెందినదిగా సమాచారం. ఇందులో ఒక వ్యక్తి వర్షపు నీటితో నిండిన రోడ్డుపై ఉన్న డివైడర్ మీద నిలబడి ‘ఆరా ఫార్మింగ్ డాన్స్’ చేస్తూ కనిపిస్తున్నాడు. అనంతరం ఆ వ్యక్తి నీటిలోకి ఓ పట్ట సహాయంతో అమాంతంగా దూకేశాడు. అలా దూకిన అతడు నీటిలో కొద్ది ముందు కొట్టుకు వెళ్తుండగా అక్కడే ఉన్న మరికొందరు అతడిని అడ్డుకోవడం కనపడుతుంది.
Irfan Pathan: అతడు అడిగితే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇటీవల సోషల్ మీడియాలో ఈ ‘ఆరా ఫార్మింగ్ డాన్స్’ ట్రెండ్ విపరీతంగా పాపులర్ అయింది. ఈ స్టైల్‌ను మొదటగా ఒక 11 ఏళ్ల ఇండోనేషియాకు చెందిన బాలుడు రేయాన్ అర్కాన్ ప్రారంభించాడు. దానితో అతడు ఒక్కసారిగా అతను ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మిశ్రమ స్పందన అందించారు. కొందరేమో.. చాలా మంది చేయలేని పనిని చేస్తూ సంతోషంగా ఉన్నవని కొందరు అంటుండగా, మరికొందరేమో.. ఇలా చేస్తే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని మండి పడుతున్నారు.
Entertainment never stops in Mumbai. The show must go on! #MumbaiRains pic.twitter.com/sySNLzC0cx
— Godman Chikna (@Madan_Chikna) August 20, 2025