సాధారణంగా ఏనుగులు చూసేందుకు చాలా పెద్దగా ఉంటాయి. దాని ఆకారాన్ని చూసి చిన్న చిన్నజంతువులు, క్రూర మృగాలు దాని దగ్గరకి వచ్చేందుకు జంకుతుంటాయి. అలాంటి భారీ కాయమున్న ఏనుగు ఓ చిన్న కుక్క పిల్లకు భయపడి బొక్క బోర్ల పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
వీడియో కనిపించిన కుక్క, దాని పిల్ల ఓ ఇంటికి కాపాలాగా ఉన్నాయి. ఒక ఏనుగు ఒక ఇంటి ముందుగా వెళుతుండగా.. ఒక కుక్క దానిని చాలా భయపెట్టింది. వెంటనే అది ఆవేశంతో దాని మీదకు వెళ్లబోయింది. పక్కనే అరుగుపై పడుకున్న కుక్క పిల్ల ఆ ఏనుగును ఒక్కసారిగా భయపెట్టింది. దీంతో అది రెండు అడుగులు వెనక్కి వేసి బోర్లా పడిపోయింది. ఈ వీడియో కొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కానీ ఇదంతా కావాలనే క్రియేట్ చేశారని.. లేకపోతే…ఏనుగు కుక్కపిల్లకు భయపడి బోర్లా పడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. డియోలలోని కుక్కలు ధైర్యంగా అనిపించినప్పటికీ, ఏనుగు ప్రతిచర్య సాధారణంగా నిజమైన భయం కంటే ఆశ్చర్యంగా లేదా చిరాకుగా ఉంటుంది. ఈ సంఘటనలు ఏనుగు భయం కంటే ఆశ్చర్యకరంగా పెద్ద చొరబాటుదారుడి పట్ల కుక్క యొక్క ప్రాదేశిక ప్రవృత్తిని ప్రదర్శిస్తాయి.
Read Also:Sai Sudharsan Catch: సాయి సుదర్శన్ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!
ఈ హాస్యాస్పదమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “కుక్కను చూసి భయపడి ఏనుగు పడిపోయింది! ఇది AI- జనరేటెడ్ వీడియోనా లేదా నిజ జీవిత సంఘటననా?” అనే క్యాప్షన్‌తో కామెంట్లు పెడుతున్నారు. ఈ 10 సెకన్ల వీడియోను ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
Elephant falls down because of fear of dog!
Is this an AI-generated video or a real incident?#Elephant #Dogs pic.twitter.com/hRNl8DQn47
— ಸನಾತನ (@sanatan_kannada) October 10, 2025