సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం యువత ఎంతటికైనా తెగిస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇలాంటి రీల్స్ చేసి ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Read Also:Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..
పూర్తి వివరాల్లోకి వెళితే.. యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. పాపులర్ అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా కొంత మంది రెచ్చిపోతున్నారు. ఫాలోవర్స్, ఫ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. డేంజరస్ వీడియోలు చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే, తాజాగా ఓ జంట చేసిన డేంజర్ రీల్ చూసి నెటిజన్‌లు షాక్ అయ్యారు. అక్కడ ఇక్కడ రీల్స్ చేస్తే కిక్కు ఏమొస్తుందని అనుకున్నారో ఏమో కానీ.. ఏకంగా రైల్వే వంతెనపై పట్టాల పక్కన ఓ జంట రీల్ చేసి.. నెటిజన్ల చేత తిట్లు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
నార్త్ ఇండియాకు చెందిన ఓ జంట ప్రమాదకరంగా ఓ రైల్వే వంతెనపై రీల్స్ చేశారు. వేగంగా వెళ్తున్న రైలు పక్కన వీడియో చేశారు. ఓవైపు వేగంగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. మరోవైపు వంతెన పట్టాల పక్కనే ఉన్న చిన్న ఇరుకు స్థలంలో డెంజరేస్‌గా నడుస్తూ రీల్ షూట్ చేస్తున్నారు. చిన్నగా కాలు జారినా, గట్టిగా గాలొచ్చినా.. కొంచెం అటు ఇటైనా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అవేవి పట్టించుకోకుండా జంట ప్రమాదకరమైన స్టంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం మరీ ఇంత రిస్క్ అవసరమా? నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదకర రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖకు ఈ జంట రీల్‌ను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.
Read Also:Dangerous Reel: మీ రీల్స్ పిచ్చి తగలెయ్యా.. మరీ రైల్వే వంతెనపై కూడానా..
సోషల్ మీడియా ఖ్యాతి కోసం తపన ప్రజలను తీవ్ర సాహసాలు చేయడానికి ప్రేరేపిస్తోంది, రైల్వే ట్రాక్‌లపై రీల్స్ తయారు చేయడం యువతలో ప్రమాదకరమైన ట్రెండ్‌గా మారింది. థ్రిల్లింగ్ వీడియోలను తీయడానికి ప్రయత్నించి చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు, అయినప్పటికీ ఈ ట్రెండ్ పెరుగుతూనే ఉంది. వీడియో సరదాగా, వినోదాత్మకంగా ఉన్నప్పటికి వారు ఎంచుకున్న ప్రదేశం చాలా సురక్షితం కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
🚨 For a few seconds of social media fame, people are now risking their lives. Dancing on active Railway Bridges with trains speeding right behind them.
One Slip, One gust of Wind… and it’s Over. 🤦♂️ pic.twitter.com/uyifgZBw6Q
— Gems (@gemsofbabus_) October 10, 2025