NTV Telugu Site icon

Viral Video: సీపీఆర్‌ చేసి కోతి ప్రాణాలు కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌..

Police Monkey

Police Monkey

దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పిల్ల మూర్ఛపోయింది.

Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..?

అధిక వేడి కారణంగా, ఒక కోతి చెట్టు నుండి పడిపోయి మూర్ఛపోయింది. దాంతో ఆ సమయంలో అనేక కోతులు దాని చుట్టూ గుమిగూడాయి. దాంతో కోతిని రక్షించడం చాలా కష్టమైంది అని వికాస్ తోమర్ (51) బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. మేము అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి శిక్షణ పొందామని., మానవులు, కోతుల శరీరాలు చాలా దగ్గరిగా పోలి ఉంటాయి కాబట్టి, నా సహోద్యోగులు కోతిని ఆ గుంపు నుండి రక్షించినప్పుడు., తాను కోతిని బతికించడానికి ప్రయత్నించానని తెలిపాడు.

Noida: ఎండ తీవ్రతకు బాల్కనిలో వాషింగ్ మిషన్ పేలి.. భారీగా మంటలు

ఇందులో భాగంగా.. నేను దాదాపు 45 నిమిషాల పాటు ఛాతీని పంప్ చేసానని., అడపాదడపా రుద్దడం, నోటిలోకి చిన్న మొత్తంలో నీటిని పోయడంతో చివరకు కోతి బతికందని తెలిపాడు. ఆ కోతి రోజూ పోలీస్ స్టేషన్‌కి వస్తుంది, అది ఇప్పుడు మళ్లీ ఆడుకోవడం చూసి నేను సంతోషంగా ఉన్నానని అతను చెప్పాడు.