Viral Video: క్రికెట్.. భారతదేశంలో ఈ ఆటకు ఉన్న క్రేజ్ మారే ఏ ఆటకు లేదని చెప్పవచ్చు. క్రికెట్ ఓ జెంటిల్మెన్ గేమ్ అని అందరూ అంటుంటారు. అయితే ఈ జెంటిల్మెన్ ఆటలో ఎన్నోసార్లు.. ఎన్నో రకాలుగా గొడవలు జరిగాయి. అయితే ఆ గొడవలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరిగినవి మాత్రమే. ఇక సామాన్య ప్రజలు క్రికెట్ ఆడే సమయంలో చిన్నచితక గొడవలు సహజమే. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటాయి. అయితే తాజాగా క్రికెట్ ఆటలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే..
2025 Best Bikes : ఈ ఏడాది టాప్ 5 మోటార్‌సైకిల్ లాంచ్‌లు
ఓ గ్రామీణ నేపథ్యంలో కొందరి యువకులు కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అప్పటివరకు అంత బాగానే ఉంది. అయితే ఆ మ్యాచ్లో యువకుడికి బ్యాటింగ్ రాకపోవడంతో కాస్త మనస్థాపన చెందాడు. అంతే ఆ గ్రౌండ్ నుంచి అతడు నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ యువకుడు చేసిన పనికి అక్కడ ఉన్న యువత మొత్తం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం చేసాడనే కదా మీ అనుమానం..
Mumbai vs Uttarakhand: అరెరే.. రోహిత్ గోల్డెన్ డకౌట్.. అయినా గెలిచినా ముంబై..!
ఆ మ్యాచ్లో తన టీం ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేయగా.. తాను ఒక్క బంతి కూడా ఎదుర్కోకపోవడంతో అతడు కొపోద్రికడయ్యాడు. అయితే ఆ కోపం వారి సహచరులతో తీర్చుకోకుండా, అక్కడ నుంచి నెమ్మదిగా ఇంటికి వెళ్లి.. తనతో ఉన్న ట్రాక్టర్ కు నాగలిని జత చేసి.. ఆ మ్యాచ్ జరిగిన పిచ్ ను దున్నేశాడు. దీంతో తోటి ఆటగాళ్లు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందించారు. చాలామంది మంచి పని చేసావని అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో, అప్పుడప్పుడు బ్యాటింగ్ రాదు.. ఆ మాత్రానికి ఇంత దూకుడు చూపించాలా అంటూ మండిపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను ఓసారి మీకు కూడా చూసి, మీకు ఏమనిపించిందొ ఒక కామెంట్ చేయండి.
తనకు బ్యాటింగ్ రాలేదన్న కోపంతో ట్రాక్టర్ తో గ్రౌండ్ ను దున్నేశాడుగా.. pic.twitter.com/BBxYzd9SFe
— Ram kumar (@RAESC2828) December 26, 2025