ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ అపూర్వ ఘట్టం. అలంటి అపురూపమైన పెళ్లి వేడుకను వారు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ వేడుకలా జరుపుకుంటారు. ఈ మధ్య కొందరు పెళ్లి వేడుకను కాస్త విచిత్రంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుత కాలం యువత పెళ్లి కోసం వెడ్డింగ్ కార్డ్స్ ను వెరైటీగా ప్రింట్ చేయించడం, అదే పెళ్లి సందడిలో బారాత్ లో వధూవరులు డాన్సులు వేయడం లాంటివి చూస్తున్నాం. ఇకపోతే కొందరు మాత్రం మంగళ స్నానాలు, రిసెప్షన్ లను వారి స్టేటస్ లను గొప్పగా చూపించుకొనేలా నిర్వహిస్తుంటారు. ఇకపోతే తాజాగా ఓ యువకుడు మాత్రం తన హల్దీ ఫంక్షన్ ను కాస్త వెరైటీగా జరుపుకున్నాడు.
Also read: Pemmasani: మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం!
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నరేందర్ అనే యువకుడికి వలిగొండకు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం నిశ్చయించారు పెళ్లి పెద్దలు. ఇక పోతే థన్ పేలి కార్యక్రంలో నరేందర్ తన పెళ్లి వేడుకలను కాస్త వినూత్నంగా జరుపుకున్నాడు. వివాహ వేడుకలో ముందుగా మంగళస్నానం అనేది ఓ అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తారు. నిజానికి మంగళస్నానం అనేది పసుపు నీటితో చేస్తారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు గులాబీ పూలు, రంగురంగుల ఫ్లవర్స్, డెకరేషన్స్ తో అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగానే సంప్రదాయ పద్దతిలో కుటుంబ సభ్యులు పెళ్లికొడుకుకు గులాబీ రేకులు కలిపిన పసుపు నీటిని జల్లెడతో చల్లారు.
Also read: Mayor Vijayalakshmi: కాంగ్రెస్ లో చేరనున్న నగర మేయర్ విజయలక్ష్మి..?
అయితే పెళ్లికొడుకు మిత్రులు అక్కడికి చేరుకొని కాస్త పెద్ద హంగామే చేశారు. వినూత్నంగా వరుడిపై కల్లు, బీరు, విస్కీ బాటిల్స్ తో పోసి నానా హంగామా చేశారు. ఆ తర్వాత ఈ హల్దీ ఫంక్షన్ ను పెళ్లికొడుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు మద్యం బాటిల్స్‌తో డ్యాన్సులు, విన్యాసాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇలాంటి పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తుండడం వల్ల ఒక్కోసారి మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కానీ పరిస్థితి వచ్చింది.