వారి పిల్లలతో సరదాగా షాపింగ్ మాల్ కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని బాధనే మిలిగింది. భార్యభర్తలు వార్పిళ్లు కలిసి షాపింగ్ మాల్ కి కలిసి వెళ్లగా.. అక్కడ భార్య షాపింగ్ చేస్తున్న సమయంలో.. ఇద్దరు పిల్లలను తీసుకుని మూడో అంతస్తులో వేచి ఉన్నాడు భర్త. కాకపోతే., అనుకోకుండా అతని చేతుల్లో నుంచి ఏడాదిన్నర వయసున చిన్నారి జారి మూడో అంతస్తు నుండి కిందపడిపోయాడు. అంత హైట్ నుండి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషాదకర వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also read: Bode Prasad: నా పిల్లల మీద ఒట్టు.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు…!
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకెళ్తే.. రాయ్‌పూర్ లోని ఓ సిటీ సెంటర్ మాల్ కు భార్యాభర్తలు వారి ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్ కు వెళ్లారు. వారిలో భార్య ఓ షాప్ లో షాపింగ్ చేస్తుండగా.. వారి పిల్లలైనా ఐదేళ్ల వయసున్న కుమారుడు., ఏడాదిన్నర వయసున్న మరో కుమారుడిని తీసుకుని తండ్రి మూడో అంతస్తులో ఉన్న ఎస్కలేటర్ వద్దకు చేరాడు. ఇలా ఉండగా ఓ చేత్తో ఏడాది పసి బిడ్డను ఎత్తుకుని ఉండగా., మరో చేతితో ఐదేళ్ల కుమారుడిని పట్టుకున్నాడు. అయితే ఇంతలో పెద్ద కుమారుడు ఉన్నట్టు ఉండి ఎక్కలేరట్ పైటి ఎక్కేందుకు ప్రయత్నించగా తండ్రి అబ్బాయిని వారించేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో మరో చేతిలో ఉన్న ఏడాదిన్నర బిడ్డ తన చెతిలొనుంచి మూడో అంతస్తు నుంచి జారిపోయాడు.
Also read: Tirumala Online Tickets: నేటి నుంచి ఆన్‌లైన్ లో జూన్ నెల ఆర్జిత సేవా టిక్కెట్లు..!
అంత ఎత్తు నుండి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తమోడుతున్న చిన్నారిని వారి తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాబు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటనతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. ఇక మూడో అంతస్తు నుంచి జారీ కింద పడిన చిన్నారి దృశ్యాలు ఆ షాపింగ్ మాల్ లోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk
— Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024