Viral Video: నేటి సమాజంలో పెళ్లి అంటేంటే యువత అయ్యబాబోయ్.. మాకు వద్దు అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు, పగలు, హత్యలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక దారుణం గురించి చూస్తూనే ఉన్నాము. పెళ్లి తంతు జరిగి వారం రోజులు కూడా గడవక ముందే భార్యభర్తల మధ్య అనుమానాలు చెలరేగి, ఘర్షణలకు దారి తీస్తున్న ఉదంతాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రేమ, నమ్మకం, బాధ్యత అనే విలువలు మరిచిపోతున్న ఈ కాలంలో వివాహ బంధం ఒక ప్రశ్నగా మిగిలిపోతోంది. అయితే, ఈ మధ్యకాలపు వ్యవహారాలన్నింటినీ తిప్పికొట్టేలా మహారాష్ట్రలోని ఓ వృద్ధ దంపతుల ప్రేమానురాగం అందరినీ ఆకట్టుకుంటోంది. వయసు మీద పడినా, ప్రేమ మాత్రం క్షణం కూడా తగ్గలేదని నిరూపించిన ఆ జంటకు సంబంధించిన నెట్టింట తెగ ట్రెండ్ గా మారింది.
Read Also: Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి.. ప్రేయసిని చంపిన వ్యక్తి..
ఇక అసలు విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని ఛత్రపతి షంభాజీ నగర్ లో జరిగిన ఈ సంఘటన మనల్ని ఆనందంలో ముంచెత్తేలా చేస్తుంది. అంతలా ఏమి జరిగందనే కదా.. మీ అనుమానం. అవునండి ఓ 93 ఏళ్ల నివృతి షిండే అనే తాత, తన భార్య శాంతాబాయితో కలిసి ఓ ఆభరణాల షాప్‌కు వెళ్లారు. అక్కడికి వారు శాంతాబాయికి తాళిబొట్టు కొనాలనే విషయమై వచ్చారు. వాళ్లు షాప్ లోకి అడుగుపెట్టిన వారిని, అక్కడి స్టాఫ్ వారికైమన సహాయం అవసరమేమో అడుగుతారని భావించారు. కానీ, ఆ తాతా మాత్రం.. “నా భార్యకు తాళిబొట్టు కావాలి.. రూ. 1120 తెచ్చుకున్నాం, చూపించండి” అని అన్నాడు. ఇది వినగానే అక్కడున్న కస్టమర్లు, స్టాఫ్ ఆశ్చర్యంతో చూడసాగారు.
ఆ వృద్ధ దంపతుల అనురాగం చూసిన షాప్ యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. మొదట ఆయన వారితో కొద్దీ సేపు సంభాషణ జరిపిన తర్వాత వారు అడిగిన తాళి కోసం కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని, మిగతా మొత్తం మాఫ్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. దానితో ఆ వృద్ధ జంట ఆనందం కన్నీళ్లతో ముంచెత్తింది. ఆ షాప్ యజమాని మొదట డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి మిల్లంటి వారి నుండి ఆశీర్వాదం ఉంటే చాలు అని అన్నాడు. అయితే, ఆ జంట వారి డబ్బు తీసుకోవాలని కోరడంతో కేవలం వారి దెగ్గరయి నుండి 20 రూపాయలు మాతరమే తీసుకొని తన గొప్పమనుసును చాటుకున్నాడు. ఆ పెద్దాయన ఈ వయసులో కూడా భార్య కోసం చూపించిన ప్రేమ, తపన నన్ను ఎంతో కదిలించాయి. అందుకే మేము గిఫ్ట్ ఇచ్చాం. ఇది వారి జీవితంలోని మరొక మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని భావిస్తున్నామని షాప్ ఓనర్ చెప్పారు.
Read Also: Suryakumar Yadav: హెర్నియా సమస్యతో బాధపడుతున్న కెప్టెన్.. సర్జరీ తప్పదా..?
ఈ జంట జాల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన వారు. తరచూ తీర్థయాత్రలు చేస్తూ, ఒకరి కోసం మరొకరు బ్రతుకుతుంటారు. వారికి ఓ కుమారుడు ఉన్న వారి అవసరాలను వారే చూసుకుంటారు. ఈ సంఘటన మొత్తానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. అని కొందరు అటుంటే.. మరికొందరేమో షాప్ ఓనర్ చేసిన పనికి పెద్దెత్తున ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.