Tollywood: తెలుగు స్టార్ హీరోల సినిమాల లైనప్ ఇదే
- టాలీవుడ్ లో బిజీ బిజీగా బడా హీరోలు
- రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్స్ తో బిజీబిజీ
- పైప్ లైన్ లో ఏ సినిమాలు ఉన్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Star Heros Movies Lineup: టాలీవుడ్ లో బడా హీరోలు అందరూ ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క సినిమా కాదు రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఏ హీరో ప్రస్తుతానికి ఏ సినిమా చేస్తున్నారు? పైప్ లైన్ లో ఏ సినిమాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి మరో సినిమా ఏది ఒప్పుకోలేదు. హరీష్ శంకర్ సహా అనేకమంది దర్శకులతో ఆయన సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే ఏది విలువబడలేదు.
Also Read
నందమూరి బాలకృష్ణ: నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆయన బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈరోజే బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమా ముహూర్తం జరిగింది.
పవన్ కళ్యాణ్ : ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ అన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.
ప్రభాస్: ముందుగా ప్రభాస్ విషయానికి వస్తే మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమాలు చేస్తున్నారు. వీటిలో కేవలం రాజా సాబ్ సినిమా మాత్రమే సెట్స్ మీద ఉంది. మిగతా సినిమాలన్నీ పట్టాలెక్కాల్సి ఉంది.
మహేష్ బాబు: మహేష్ బాబు విషయానికి వస్తే చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతానికి రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
రామ్ చరణ్: రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ అనే సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపే ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా పట్టాలెక్కించాల్సి ఉంది.
అల్లు అర్జున్ : అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతుంది. సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్: జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. తర్వాత దేవర 2 సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!