Viral News: మోడ్రన్ బిచ్చగాడు..చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు చేతులు, కాళ్లు బాగానే ఉన్న కొందరు సోమరి పొతులుగా మారుతున్నారు.. అలాంటి వాళ్ళు రోడ్ల మీద, రైళ్ల లో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారి గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు.. సాధారణంగా రైళ్లలోని సాధారణ కోచ్‌లలో యాచకులు పాటలు పాడుతూ అడుక్కుంటూ ఉంటారు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో రైళ్ళల్లో బిక్షగాళ్లు ఉంటారు.. అయితే వారి చేతిలో మాములుగా సంచి లేదా బొచ్చే ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇప్పుడు వాళ్ళు కూడా డిజిటల్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.. చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్నారు.. తాజాగా ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది..
వీడియోలో ఒక బిచ్చగాడు తన చేతిలో క్యూఆర్ కోడ్‌తో ప్రజలను వేడుకుంటాడు. రైలులో ఉన్న ఓ వ్యక్తి తన భిక్షాటన తీరును రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. సాధారణంగా ఒక బిచ్చగాడు వచ్చి దానం చేయమని అడిగితే.. కొందరు చిల్లర ఉంటే వేస్తారు. మరికొందరు తినేందుకు ఏదైనా ఉంటే ఇస్తారు.. ఇంకొందరు చిల్లర లేదని తిప్పి పంపించేస్తుంటారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి నగదు లేదనే చెప్పాలి. అయితే ఈ బిచ్చగాడు తన దూరదృష్టిని ఉపయోగించి చేతిలో క్యూఆర్ కోడ్‌తో అడుక్కుంటున్నాడు. లోకల్ రైలులో భారీ జనసందోహం మధ్య ఓ వ్యక్తి చేతిలో క్యూఆర్ కోడ్‌తో పాట పాడుతూ అడుక్కుంటున్న వీడియో ఒకటి వెలుగు చూసింది..
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
అతన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.. క్యూఆర్ కోడ్‌లు పట్టుకుని రోడ్డు పక్కన బిచ్చగాళ్లు నిలబడిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించినట్లు సమాచారం. అక్కడ ఒక బిచ్చగాడు పాట పాడుతూ భిక్షాటన చేయడాన్ని చూడవచ్చు.. అది చూసిన స్థానికులు కూడా ఆశ్చర్య పోతున్నారు.. ఈ ఘటన వీడియో వైరల్ అవ్వడంతో ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే లైకులు, కామెంట్స్ తో దూసుకుపోతుంది..
#MumbaiLocal #DigitalIndia
That’s Mumbai local where you can see the height of using digital payment
A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM— 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?