తాజాగా చైనా దేశంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. చైనాలోని హాంగ్‌జౌ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. 9 నెలలు నిండిన ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే బయటికి వచ్చిన బిడ్డను చూసి వైద్యులు ఒకింత షాక్ అయ్యారు. మామూలుగా కొంతమంది శిశువుల్లో జన్యుపరమైన లోపల వల్ల జన్మిస్తారు. అచ్చం అలాంటిదే చైనాలో జరుగగా ఓ మహిళకు మాత్రం ఏకంగా తోక ఉన్న పాప జన్మించింది.
Also read: CM Revanth: తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..
అందరిలాగే గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేసిన తర్వాత పసికందును పరిశీలించిన వైద్యులు పాపకి తోక ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ తోక చిన్నారి వెనుక వైపున మీకు కింది భాగంలో ఉంది. ఈ తోక 3.9 అంగుళాలు అంటే 10 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఇక ఈ పాపకు అసంపూర్ణమైన క్షీణత వల్ల తోక వచ్చినట్లు వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మాత్రం పాప తోకను తొలగించాలని వైద్యులను కోరారు.
Also Read: Petrol Price Reduce: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గింపు.. ఎక్కడంటే?
కాకపోతే ఆ తోక పాప నాడివ్యవస్థతో అనుసంధానమై ఉందని వైద్యులు తెలిపారు. అలా నాడివ్యవస్థతో అనుసంధానమై ఉన్న దానిని తొలగించడం మంచిది కాదని వైద్యులు సూచించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఏం చేయలేక తోకను అలాగే ఉంచేశారు. అచ్చం ఇలాంటి కేసు ఇదివరకు అమెరికాలో కూడా నమోదయింది. ప్రస్తుతం ఈ పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.
The Truth Behind The Baby Born With Four Inch Long Tail In China https://t.co/VDG694XvcJ pic.twitter.com/eR4PP88clJ
— Hira Mokariya (@MokariyaHira) March 15, 2024